ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే... ముందే చెప్పేసిన అమిత్ షా

  • ఇవాళ  సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
  • మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం
  • ఇంకా కేటాయించని శాఖలు
  • తన ట్వీట్ ద్వారా పవన్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా
ఏపీలో ఇవాళ సీఎం చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కు ఏపీ డిప్యూటీ సీఎం పదవి ఖాయం అంటూ ప్రచారం జరిగినప్పటికీ, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అసలు, ఏ మంత్రికీ ఇంకా శాఖలు కేటాయించలేదు.

ఈ నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అంటూ అమిత్ షా ఈ మధ్యాహ్నం ట్వీట్ చేశారు. ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి అమిత్ షా కూడా హాజరయ్యారు. 

అనంతరం ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ, సీఎం చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అందరికీ అభినందనలు అని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుతూ, ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని విశ్వసిస్తున్నట్టు అమిత్ షా తన ట్వీట్ లో వివరించారు.

Pawan Kalyan
Deputy CM
Amit Shah
Janasena
BJP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News